తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.పదికోట్ల విషయమై పోలీసులకు సినీనటుడు నరేశ్ ఫిర్యాదు - తెలంగాణ వార్తలు

కీ స్టోన్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి తమ దగ్గర రూ.7.5 కోట్లు తీసుకొని చెల్లించడం లేదని సినీ నటుడు నరేశ్ తెలిపారు. తమతో ఉన్న పరిచయంతో ఇస్తే ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని అన్నారు. మొత్తం రూ.10కోట్లు రావాల్సి ఉందని వివరించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

actor naresh complaint to police, actor naresh latest news
పోలీసులనాశ్రయించిన నరేశ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన నరేశ్

By

Published : Apr 18, 2021, 1:04 PM IST

కీ స్టోన్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన లింగం శ్రీనివాస్ తమ దగ్గర రూ.7.5 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని సీసీఎస్ పోలీసులకు సినీ నటుడు నరేశ్ ఫిర్యాదు చేశారు. తమ కుటుంబంతో ఉన్న పరిచయంతో ఆ డబ్బులను... హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్నారని అన్నారు.

డబ్బులు తీసుకుని ఆరేళ్లు దాటినా ఇప్పటికీ తిరిగి చెల్లించలేదని.. ఈ విషయంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో 3 రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు ఓ వీడియో విడుదల చేశారు. తమకు ఇప్పటి వరకు వారి వద్ద నుంచి మొత్తం 10 కోట్ల రూపాయలు రావాలని అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారని... అందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:సోషల్‌మీడియా శ్రీమహాలక్ష్ములు.. మిలియన్లలో ఫాలోవర్స్!

ABOUT THE AUTHOR

...view details