Actor Manoj kumar Remand Report :శామీర్‌పేట్ సెలబ్రిటీ విల్లాలో కాల్పులు జరిపిన కేసులో.. నటుడు మనోజ్‌కుమార్ నాయుడు అలియాస్ సూర్యతేజ్ రిమాండ్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన బంధానికి అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో సిద్ధార్థ్ దాస్‌ను హతమార్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు నిర్ధారించారు. 2003లో స్మిత గ్రంధితో.. సిద్ధార్థ్ దాస్‌కు వివాహం జరిగిందని తెలిపారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారని చెప్పారు.
గతంలో దంపతులిద్దరూ హైదరాబాద్‌లోని మూసాపేటలో నివాసం ఉండేవారని పోలీసులు తెలిపారు. మనస్పర్థలతో 2019లో స్మిత విడాకులకు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తానుండే ప్రాంతానికి సిద్ధార్థ్ రాకుండా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారని చెప్పారు. అప్పటినుంచి భార్యభర్తలు విడివిడిగా జీవిస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఆమె బుద్ధిజం పేరుతో మానసిక సమస్యలకు కౌన్సిలింగ్ ఇచ్చేవారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.
- Shamirpet Gun Firing Update: 'శామీర్‌పేట్' కాల్పుల ఘటన.. నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Shamirpet Gun Fire Incident Updates : ఇదే సమయంలో మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న, విజయనగరం జిల్లా రాజాంకు చెందిన మనోజ్ ఫేస్‌బుక్ ద్వారా స్మితను సంప్రదించాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే స్మిత తన వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవడంతో ఇద్దరూ దగ్గరయ్యారని వెల్లడించారు. మరోవైపు భర్తతో వేరుగా ఉంటున్న స్మిత 2020లో ప్రశాంత్ అనే వ్యక్తితో కలిసి కన్సల్టెన్సీ సేవల సంస్థను ప్రారంభించారని పోలీసులు వివరించారు.
సంస్థ నుంచి ప్రశాంత్ వెళ్లిపోయాక స్మిత, మనోజ్ ఇద్దరూ కలిసి నిర్వహించారని పోలీసులు చెప్పారు. వచ్చిన లాభాలతో 2021లో శామీర్‌పేట్ లోని సెలబ్రిటీ విల్లాలో ఇల్లు కొని అక్కడే కార్యాలయం నిర్వహిస్తూ, నివాసంగానూ ఉపయోగించేవారని పేర్కొన్నారు. స్మిత ఇద్దరు పిల్లల చదువుల విషయంలో మనోజ్ కఠినంగా వ్యవహరించేవాడని వెల్లడించారు. స్మిత కుమారుడు ఇంటర్‌లో ఫెయిలయ్యాడని మనోజ్ కొట్టాడని పోలీసులు వివరించారు.