Actor Manchu Manoj: సినీనటుడు మంచుమనోజ్ కడప పెద్ద దర్గాను సందర్శించారు. దర్గా నిర్వాహకులు మనోజ్‌కు ఘనంగా స్వాగతం పలికారు. తలపాగ చుట్టి దర్గాలో పూల చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. తాను కొత్త జీవితంతో పాటు కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కుటుంబంతో కలిసి దర్గాను దర్శిస్తానని మంచు మనోజ్ వెల్లడించారు. మనోజ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
త్వరలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నా..: మంచు మనోజ్ - andhra pradesh news
Actor Manchu Manoj: సినీ నటుడు మంచుమనోజ్ కడప పెద్ద దర్గాను సందర్శించారు. దర్గాను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు, కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా అని మంచు మనోజ్ తెలిపారు.
Actor Manchu Manoj
"దర్గాకు రావటం చాలా ఆనందంగా ఉంది. అందరూ బాగుండాలి. మన చుట్టు పక్కలున్న వారు బాగుండాలని ప్రార్థించాను. కొత్త సినిమాలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న, దానికి ఆ దేవుడి దీవేనలు కావాలి. ఇంకోసారి వచ్చేటప్పుడు కుటుంబంతో కలిసి వస్తాను." -మంచు మనోజ్, సినీ నటుడు
ఇవీ చదవండి: