రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా.. పరీక్షలను చేయించుకునేలా ప్రోత్సహించేలా స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి(Rana at Onco Cancer Centre) అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఆంకో క్యాన్సర్ సెంటర్(Onco cancer centre)లో పింక్ కాన్వాస్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రానా.. కాన్వాస్ బ్రోచర్ ఆవిష్కరించారు.
హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో రొమ్ము క్యాన్సర్(Rana at Onco Cancer Centre) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని రానా అన్నారు. ప్రతి 22 మంది భారతీయ మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. దీనిపై ఆంకో క్యాన్సర్ సెంటర్ అవగాహన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని(Rana at Onco Cancer Centre) హర్షం వ్యక్తం చేశారు. 45 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్షలు(Rana at Onco Cancer Centre) చేయించుకోవాలని రానా సూచించారు.