తనికెళ్ల భరణి, ప్రముఖ వైద్యులు ఎఎస్ నారాయణ గురించి ఎంత చెప్పిన తక్కువేనని తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. భరణి ఏ పాత్రలోనైనా ఒదిగిపోతారని ప్రశంసించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రాజ్ఞిక ఫౌండేషన్, ప్రాజ్ఞిక ఆర్ట్స్ అకాడమీ, సీల్‌వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 'సంగీత సాహిత్య సమలంకృతే' పేరిట.... సినీ గీత రచయిత జాలాది, సినీ సంగీత దర్శకులు జె.వి.రాఘవులుకు స్వరాభిషేకం-17 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు,రచయిత తనికెళ్ల భరణికి జాలాది పురస్కారంతో పాటు గాంధర్వమణి బిరుదును, ప్రముఖ వైద్యులు ఎఎస్. నారాయణకు బహుముఖ సేవాతపస్వి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్‌తో పాటు పలువురు సినీ నటులు పాల్గొన్నారు.
తనికెళ్ల భరణికి జాలాది పురస్కారం.... - doctor
ఎక్కడ కవులు గౌరవించబడుతారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. జాలాది లాంటి గొప్ప రచయిత అవార్డుతో తనను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
tanikella bharani
ఇవీ చూడండి:'స్వర్ణం తీసుకుంటున్నప్పుడు గర్వంగా ఫీలయ్యా'