Balakrishna Watched Veerasimhareddy : ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరి ఎస్వీ థియేటర్‌లో బాలకృష్ణ సందడి చేశారు. సంక్రాంతికి బాలకృష్ణ కుటుంబసభ్యులతో కలిసి నారావారిపల్లె వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్‌కి వచ్చిన ఆయన.. వీరసింహారెడ్డి సినిమాను తిలకించారు. అభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. దీంతో థియేటర్ వద్ద కోలాహలం నెలకొంది. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ అభిమానులు నినాదాలు చేశారు. బాలకృష్ణ, వసుంధర, మోక్షజ్ఞ, నారా బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు, వారి పిల్లలు కలసి వీరసింహారెడ్డి సినిమాను వీక్షించారు. అనంతరం 50 కేజీల భారీ కేక్‌ను బాలయ్య అభిమానులు కట్ చేశారు.
కుటుంబసభ్యులతో కలిసి 'వీరసింహారెడ్డి' చూసిన బాలకృష్ణ - Balakrishta in Sankranthi sambaralu
Balakrishna Watched Veerasimhareddy : తన కుటుంబసభ్యులతో కలిసి బాలకృష్ణ ఈరోజు వీరసింహారెడ్డి సినిమాను వీక్షించారు. సంక్రాంతికి ఏపీలోని నారావారిపల్లె వెళ్లిన కుటుంబసభ్యులు.. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్వీ థియేటర్‌లో చిత్రాన్ని వీక్షించారు. దీంతో థియేటర్ వద్ద కోలాహలం నెలకొంది. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ అభిమానులు నినాదాలు చేశారు.
Balakrishna Watched Movie with Family