తెలంగాణ

telangana

ETV Bharat / state

కోడెల శివప్రసాద్​కు బాలకృష్ణ ఘన నివాళి - balakrishna latest news

దివంగత తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద్ మొదటి వర్ధంతి సందర్భంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటులో కోడెల పాత్రను గుర్తుచేశారు.

actor balakrishna condolance to kodela shiva prasad at basava tarakam hospital hyderabad
కోడెల శివప్రసాద్​కు బాలకృష్ణ ఘన నివాళి

By

Published : Sep 16, 2020, 11:09 PM IST

స్వర్గీయ కోడెల శివ ప్రసాద్ మొదటి వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్​లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ప్రభాకర్ రావు, సిబ్బందితో కలిసి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడెల చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

తెదేపాలో చేరిన నాటి నుంచి ఆయన చేసిన అనేక కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటులో కోడెల పాత్ర గొప్పదన్న ఆయన...అలాంటి మహానీయుని ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టాలని భట్టికి విజ్ఞప్తి : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details