మైండ్ స్పేస్‌పై జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్. కొవిడ్ విషయంలో మైండ్ స్పేస్ యాజమాన్యం చాలా జాగ్రత్తలు తీసుకుందని ఆయన వివరించారు. కొన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.
'మైండ్‌స్పేస్‌లో రేపటి నుంచి యథావిధిగానే కార్యకలాపాలు' - హైదరాబాద్‌లో కరోనా వైరస్
మైండ్ స్పేస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించిన కార్యకలాపాలు రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. కరోనాపై వచ్చే వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపడేశారు.
'మైండ్ స్పేస్‌లో రేపటి నుంచి యథావిధిగా కార్యకలాపాలు'
మైండ్ స్పేస్‌లోని కార్యాలయంలో ఓ ఉద్యోగినికి వైరస్ లక్షణాలు బయటపడినందున... అక్కడ పని చేసినవారు వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఉద్యోగిని పనిచేసిన భవనాన్ని పూర్తిగా శుభ్రం చేయాలని పేర్కొన్నారు. కొద్ది రోజుల వరకు ఆ ప్రాంతంలో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగిని కుటుంబ సభ్యులకు కూడా వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.
ఇవీ చూడండి:ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం
Last Updated : Mar 4, 2020, 8:15 PM IST