తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపాలికల్లో మూడేళ్ల తర్వాతే అవిశ్వాసం - undefined

కొత్త పురపాలక చట్టం.. పురపాలన పర్యవేక్షణ కోసం ప్రభుత్వం కలెక్టర్లకు క్రియాశీలక బాధ్యతలు అప్పగించింది. పురపాలక సంఘాల్లో ప్రభుత్వమే నేరుగా పనులు చేపట్టనుంది. చట్టపరిధిలోకి 25కు పైగా పౌర సేవలను చేర్చి.. పనుల పూర్తికి కాలపరిమితిని నిర్దేశించింది.

కలెక్టర్లకు క్రియాశీలక బాధ్యతలు

By

Published : Jul 19, 2019, 5:32 AM IST

Updated : Jul 19, 2019, 7:33 AM IST

కలెక్టర్లకు క్రియాశీలక బాధ్యతలు

జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు
పురపాలక తీర్మానాలను అమలుచేయడంలో చట్టాన్ని అమలు చేసేందుకు కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలను కొత్త పురపాలక చట్టంలో కల్పించారు. జిల్లా కలెక్టర్ తమ జిల్లాలోని ఒక పురపాలక సంఘాన్ని వారానికి ఒకసారి తనిఖీ చేసి పనితీరును సమీక్షించాలి. తమ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులతో నెలవారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలి.
విధులు, బాధ్యతలు@కలెక్టర్
కొత్త పురపాలక చట్టంలో అత్యవసర పనులను చేయాలని కలెక్టర్​కు ఆదేశించే వెసులుబాటును కల్పించారు. అయితే.. వీటికి సంబంధించిన నిధులను మాత్రం పురపాలక సంఘమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లించకుంటే మున్సిపల్ నిధుల నుంచి చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. కౌన్సిల్ తీర్మానాలను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్​కు ఇచ్చారు. తీర్మానం, జారీచేసిన లైసెన్స్, ఉత్తర్వులు, అనుమతులను రద్దుచేసే అధికారం కట్టబెట్టారు.
పురపాలక సంఘాల ప్రక్షాళన
పురపాలకసంఘాలు మరింత సమర్థమంతంగా పనిచేసేలా కొత్త చట్టంలో మార్పులు చేశారు. జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల ఉద్యోగులు, హెచ్ఎండీఎ సహా ఇతర పట్టణాభివృద్ది సంస్థలకు ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేయవచ్చు.

Last Updated : Jul 19, 2019, 7:33 AM IST

For All Latest Updates

TAGGED:

KIRAN

ABOUT THE AUTHOR

...view details