కరోనాను అరికట్టాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని... బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగే వాళ్లపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. కరోనా నివారణ కోసం పోలీస్ శాఖ తరఫున పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, పోలీస్ స్టేషన్ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా రెండో విడత రాష్ట్రంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని... ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సాయం తీసుకొని పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.