నేటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలకు అనుమతి - Allola Indrakaran Reddy
19:46 October 03
నేటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలకు అనుమతి
రాష్ట్రంలోని దేవాలయాల్లో నేటి నుంచి ఆర్జిత సేవలు, పూజలు, ఇతర కార్యక్రమాలను పున:ప్రారంభించనున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని మంత్రి స్పష్టం చేశారు.
భక్తులు భౌతిక దూరన్ని పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి :ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చేందుకు తెరాస ప్రణాళిక!