మూడు గంటలపాటు విచారణ
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల విచారణ ముగిసింది. బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో మూడున్నర గంటల పాటు ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్‌ని దర్యాప్తు అధికారి కేఎస్‌రావు, డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ప్రశ్నించారు.
హత్య జరిగిన అనంతరం రాకేశ్‌రెడ్డి చరవాణి సంభాషణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్య విషయం ముందే తెలిస్తే ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. ఎంత కాలం నుంచి రాకేశ్‌రెడ్డితో పరిచయం ఉందో ఆరా తీశారు.
పోలీసుల హస్తముంటే చర్యలే..
రాకేశ్‌రెడ్డి, పోలీసు అధికారులు వెల్లడించిన విషయాలను బేరీజు వేసుకున్నారు. నిందితుడు రాకేశ్‌రెడ్డి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరిని దర్యాప్తు చేస్తామని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే తగిన చర్యలు ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు.
ఏసీపీ, సీఐ విచారణ పూర్తి... - mallareddy
జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను దర్యాప్తు అధికారులు విచారించారు. దాదాపుగా మూడున్నర గంటల పాటు ఏసీపీ మల్లారెడ్డిని ప్రశ్నించారు.
మూడు గంటలపాటు విచారణ
ఇవీ చదవండి:8 గంటల పాటు సాగిన విచారణ