ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరంలో దారుణం చోటుచేసుకుంది. న్యూపోర్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన వివాహిత (26) సమతానగర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వచ్చారు. సాయంత్రం వీరిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి వివాహితపై యాసిడ్ చల్లి పరారయ్యాడు.
రోడ్డుపై వెళ్తున్న వివాహితపై యాసిడ్ దాడి - Acid attack on married man in Gazuwaka, Visakha district of Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా గాజువాకలో వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళపై దుండగుడు యాసిడ్తో దాడి చేయడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తీవ్రగాయాలైన మహిళను ఆస్పత్రికి తరలించారు. మహిళ ముఖం, చేతులు కాలినట్లు వైద్యులు గుర్తించారు.
రోడ్డుపై వెళ్తున్న వివాహితపై యాసిడ్ దాడి
ఆమె మోచేయి, ఛాతి, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం బాధితురాలిని గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఈ దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్