జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్ఠాత్మక ఏసీఐ (ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్)... 'ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ' అవార్డును సాధించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రయాణికులకు జీఎంఆర్ ఉత్తమ సేవలందించిందని ఏసీఐ కొనియాడింది. 2020 సంవత్సరానికి గాను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైనట్లు విమానాశ్రయ యాజమాన్యం తెలిపింది.
జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏసీఐ అవార్డు - హైదరాబాద్ తాజా వార్తలు
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏసీఐ (ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్) అవార్డు దక్కింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలందించడంలో.. 2020 ఏడాదికి గాను ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ఈ పురస్కారం తమలో మరింత స్ఫూర్తిని నింపిందని గైల్ సీఈఓ అన్నారు.
జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏసీఐ అవార్డు
ఏసీఐ నిర్వహించిన వార్షిక సర్వేలో ప్రయాణీకులు ఉత్తమ విమానాశ్రయంగా ఎన్నుకోవడం తమకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు... గైల్ సీఈఓ ప్రదీప్ పణికర్ తెలిపారు. కొవిడ్ మహమ్మారి క్లిష్ట సమయాల్లో తమకు మద్దతిచ్చిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం ప్రయాణీకులకు మరిన్ని సేవలు అందించడానికి, తమకు స్ఫూర్తినిస్తుందన్నారు.
ఇదీ చదవండి: నల్లమల అడవుల్లో పెద్దఎత్తున మంటలు