ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిందని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్ తెలిపారు. జయశంకర్ 85వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కలల ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని సీఎం కేసీఆర్ పూర్తి చేశారని కొనియాడారు. ఆరేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధే జయశంకర్‌కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేసిన ఉద్యోగులు.. ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం పని చేస్తున్నామని స్పష్టం చేశారు.
జయశంకర్ స్ఫూర్తితోనే రాష్ట్ర సాధన - జయశంకర్ స్పూర్తితో నీళ్లు, నిధులు, నియామకాల
జయశంకర్ 85వ జయంతి సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో నివాళులర్పించారు. నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం సాగిందని పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధే జయశంకర్‌కు నిజమైన నివాళి : కారెం రవీందర్ రెడ్డి