తెలంగాణ

telangana

ETV Bharat / state

Prof. Kodandaram: హుజూరాబాద్​ ఎన్నికలు తెరాసకు ఓ గుణపాఠం

నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రధాన కారకులైన ముఖ్యమంత్రి కేసీఆర్​పై కేసు నమోదు చేయాలని తెజస పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఆత్మస్థైర్యంతో సబ్బండ వర్గాలను కలుపుకుని పోరాడుదామన్నారు. మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి రోజైన డిసెంబర్​ 3న... వేలాదిమంది నిరుద్యోగులతో 'తెలంగాణ యూత్ డిమాండ్స్ డే' నిర్వహిస్తున్నామని తెలిపారు.

By

Published : Nov 2, 2021, 4:46 PM IST

tjs
tjs

హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ సరళి రాష్ట్ర ప్రభుత్వంపై గల వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని తెజస పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. డబ్బులతో మేనేజ్ చేస్తూ ఎన్నికల్లో గెలుస్తున్న తెరాస పార్టీకి ఈ ఎన్నికలు గుణపాఠమని పేర్కొన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని అన్నారు. ఆ దిశగా ప్రతిపక్ష పార్టీలు ముందుకు వెళ్లాలని కోరారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రధాన కారకులైన ముఖ్యమంత్రి కేసీఆర్​పై కేసు నమోదు చేయాలని ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఆత్మస్థైర్యంతో సబ్బండ వర్గాలను కలుపుకుని పోరాడుదామన్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించకపోతే మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి రోజైన డిసెంబర్​ 3న... హైదరాబాద్​లో వేలాదిమంది నిరుద్యోగులతో "తెలంగాణ యూత్ డిమాండ్స్ డే" నిర్వహిస్తున్నామని తెలిపారు. యువ జన సమితి, విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో కరపత్రాన్ని హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో... విద్యార్థి నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:Bandi sanjay on sircilla incident: 'తెరాస నాయకులు ఏం చేసినా చెల్లుతుంది.. సిరిసిల్ల ఘటనే నిదర్శనం'

ABOUT THE AUTHOR

...view details