యాసంగి (రబీ) సీజన్‌లో వరి సాగు(paddy cultivation requires) వద్దని ప్రభుత్వం చెబుతున్నందున ఇతర పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచించింది. పలు రకాల(alternative crops for paddy in telangana) పంటల సాగుకు రాష్ట్రంలో వాతావరణం, భూములు అనుకూలంగా ఉన్నాయి. ఎకరా వరి సాగుకు వినియోగించే నీటితో 4 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేయొచ్చు. రాష్ట్రంలోని వ్యవసాయ బోర్ల కింద రైతులు వరి(paddy cultivation requires) వేయడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయంగా(alternative crops examples) పెసర, మినుము, సెనగ, వేరు సెనగ, ఆవాలు, కుసుమ, పొద్దుతిరుగుడు తదితర పంటలను వేస్తే మంచి దిగుబడులు పొందడంతో పాటు అధిక లాభాలార్జించడానికి అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలా సాగితే లాభం...
- సాగునీటి వసతి ఉన్న భూముల్లో ఈ నెల 15లోగా సెనగ, ఆవాలు, కుసుమ పంటలను వేయొచ్చు. ముఖ్యంగా ఆవాలుకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ భూములు, వాతావరణం ఈ పంటకు బాగా అనుకూలమని జాతీయ ఆవాల పరిశోధనా కేంద్రం సూచించింది. నిత్యం వంటల్లో వాడే ఆవాల ధర తగ్గే అవకాశమే లేదని ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు వెంకట్రాంరెడ్డి తెలిపారు.
- ఈ నెల 30 వరకూ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వేరుసెనగ పంట వేసుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వేరుసెనగలతో పాటు, దాని నుంచి తయారు చేసే నూనెకూ డిమాండ్ ఉంది. యాసంగిలో తెలంగాణలో నాణ్యమైన వేరుసెనగలు పండుతాయి. వీటిని వచ్చే జూన్ నుంచి ప్రారంభమయ్యే సీజన్‌లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర రైతులు విత్తనాలుగా కొంటారు. దీంతో మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయని, అందుకే ఈ పంటను ప్రోత్సహిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు చెప్పారు.
- తృణ ధాన్యమైన జొన్న పంటకు ఏడాది పొడవునా మార్కెట్లలో డిమాండ్ ఉంది.
- ఒక్క తెలంగాణలోనే నెలకు దాదాపు 10 వేల టన్నుల పొద్దుతిరుగుడు వంట నూనెను విక్రయిస్తున్నారు. ఈ పంట ఇక్కడ సాగులో లేక ఉక్రెయిన్, రష్యా వంటి సుదూర దేశాల నుంచి నూనె దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొద్దు తిరుగుడు పంట సాగుచేస్తే మద్దతు ధర కచ్చితంగా వచ్చే అవకాశాలున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. జూన్‌లో వరి వేసిన పొలాల్లో వచ్చేనెల 30లోగా జొన్న, పొద్దుతిరుగుడు పంటలను వేసుకోవచ్చని జయశంకర్ వర్సిటీ సూచించింది.
స్వీట్‌కార్న్‌కూ డిమాండ్...