తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ జయంతిని తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో నిర్వహించింది. స్వరాష్ట్ర సాధనకోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జీవిత చరిత్రను పాఠ్యంశాంలో చేర్చాలని ప్రభుత్వాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ కోరారు. జయశంకర్ ఆశయ సాధన కోసం తామంత కృషి చేస్తున్నామని ఇంజినీర్లు అన్నారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న 1,152 మంది ఏపీ ఉద్యోగులను వారి స్వరాష్ట్రానికి పంపించాలని ముఖ్యమంత్రిని శివాజీ కోరారు .
ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు - 85వ జయంతి
ఆచార్య జయశంకర్ 85వ జయంతి వేడుకలను తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది. జయశంకర్ విగ్రహానికి అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ పులమాల వేసి నివాళులర్పించారు.
ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు