తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమోన్మాది దాడి కేసులో 8 మంది అరెస్టు.. మిగతావారి కోసం గాలింపు - Accused who attacked a girl in the name of love

Assault on minor girl: ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో బాలికతోపాటు ఆమె బంధువులపై యువకుడు, అతడి బంధువులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన ఘటనలో.. 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Assault on minor girl
Assault on minor girl

By

Published : Oct 25, 2022, 4:59 PM IST

Accused who attacked a girl in the name of love: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో బాలికతోపాటు ఆమె బంధువులపై యువకుడు, అతడి బంధువులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన ఘటనలో.. 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

దాడికి ఉపయోగించిన కర్రలు, రాళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. యువకుడు మణికంఠ అతని తమ్ముడు ఏడుకొండలు మరి కొంతమంది కలిసి బాలికను ఆమె కుటుంబీకులను గాయపరిచారన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే: పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో బాలికతోపాటు ఆమె బంధువులపై యువకుడు, అతడి బంధువులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. ఈ ఘటనలో మొత్తం 11మందికి గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. ఫిరంగిపురానికి చెందిన బాలికకు పెళ్లి కుదిరింది. గ్రామంలోని ప్రకాశం పంతులు వీధికి చెందిన మణికంఠ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఇబ్బంది పెట్టాడు. దీనిపై మాట్లాడుకునేందుకు రెండు కుటుంబాలవారు సమావేశమయ్యారు.

పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానని బాలిక తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మాటా మాటా పెరగడంతో మణికంఠ, అతని బంధువులు కర్రలు, రాళ్లతో బాలికతోపాటు ఆమె కుటుంబీకులపై ఒక్కసారిగా దాడి చేశారు. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగటంతో.. మొత్తం 11మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 9మందిని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలికతోపాటు ఆమె బంధువుకు తలపై తీవ్ర గాయం కావడంతో గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాలిక, ఆమె బంధువులు వెల్లడించారు. మణికంఠ తరఫు వారికి ఒకరికి గాయమైంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details