వృద్ధురాలిపై ఆత్యాచారం చేసి... ఆమె మృతికి కారణమైన నిందితుడిని హైదరాబాద్ కుల్సుంపుర పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న పురాణాపూల్ వద్ద గల బ్రిడ్జి కింద నిద్రిస్తున్న ఓ వృద్దురాలిపై... పార్ధివవాడలో నివాసముండే మహేశ్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఆఘాయిత్యాన్ని గమనించిన స్థానికులు నిందితున్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయాడు. అనంతరం వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఘటన జరిగిన స్థలానికి సమీపంలో ఉన్న శివాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అరెస్టు చేసి విచారించగా... నేరాన్ని అంగీరించాడని గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డి వివరించారు. నిందితుడు మహబూబ్‌నగర్‌కు చెందినవాడిగా గుర్తించారు. మహేశ్‌కు తల్లిదండ్రులు లేకపోవటం వల్ల మేనమామతో ఉంటూ... బొగ్గుల కొలిమిలో పనిచేస్తున్నాడు. తాగిన మత్తులో ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడని నిర్ధరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.
వృద్ధురాలిపై అత్యాచారం చేసిన నిందితుడు అరెస్టు... - CRIME NEWS UPDATES
హైదరాబాద్ పురాణాపూల్ వద్ద గల బ్రిడ్జ్ కింద ఓ వృద్ధురాలిపై ఆత్యాచారం చేసి పారిపోయిన నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మహేశ్‌గా గుర్తించారు. ఘటన స్థలానికి దగ్గర గల శివాలయంలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు.
ACCUSED ARRESTED IN OLDAGE WOMEN RAPED AND DIED IN PURANAPOOL