తెలంగాణ

telangana

ETV Bharat / state

చోరీ కేసును ఛేదించిన పోలీసులు - ఆంధ్రప్రదేశ్​ చోరీ కేసు ఛేదన

గత నెల 29న ఆంధ్రప్రదేశ్​ గుడివాడలోని పచ్చళ్ల వ్యాపారి ఇంట్లో జరిగిన చోరీ కేసులో.. అతని పినతల్లి కూతురే నిందితురాలని పోలీసులు తెలిపారు. వ్యాపారి ఇంట్లో డబ్బులున్నాయని తెలుసుకుని... మరికొంతమంది వ్యక్తులతో కలిసి ఆమె దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేల్చారు.

accused-arrested-at-robbery-case-in-gudivada-krishna-district
చోరీ కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Jun 4, 2020, 8:23 PM IST

ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లా గుడివాడలోని ధనియాలపేటలో గత నెల 29న ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాలనీలో నివాసముంటున్న పచ్చళ్ల వ్యాపారి నాగరాజు.. తనకు చెందిన ఆస్తిని విక్రయించగా వచ్చిన సొమ్మును ఇంట్లో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అతని పిన్ని కూతురు... మరికొంతమంది వ్యక్తులతో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. కత్తులతో నాగరాజును బెదిరించి డబ్బు దొంగిలించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకొని... విచారణ చేయగా వారు నిజం అంగీకరించారు. వారి నుంచి రూ. 10 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. నిందితుల్లో కొందరిపై రౌడీషీట్లు ఉన్నాయని.. మిగతా వారిపై ఇప్పుడు రౌడీషీట్లు తెరుస్తామని తెలిపారు.

ఇవీ చదవండి :ఏనుగుని చంపినవారి ఆచూకీ చెప్తే రెండు లక్షల నజరానా

ABOUT THE AUTHOR

...view details