71 లక్షల ఎకరాల్లో పంటల సాగు.. వ్యవసాయశాఖ తాజా నివేదిక
Agriculture Department: రాష్ట్రంలో భారీ వర్షాలతో పంటల సాగు నిదానంగా సాగుతోంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో బుధవారం నాటికి 80.57 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను.. 71.78 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.
Agriculture Department: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పంటల సాగు నిదానంగా సాగుతోంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో బుధవారం నాటికి 80.57 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 71.78 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికిచ్చిన నివేదికలో తెలిపింది. గతేడాది ఈ సమయానికి ఏకంగా 90 లక్షల ఎకరాలకు పైగా సాగవడం గమనార్హం. ఈ సీజన్‌లో ఏ ఒక్క పంట కూడా సాధారణం కన్నా అదనంగా సాగు కాకపోవడం గమనార్హం. వరినాట్లు వేయడానికి ఇంకా సమయమున్నందున సాధారణ స్థాయికి పంటల సాగు విస్తీర్ణం చేరే అవకాశముందని వ్యవసాయశాఖ అంచనా.