సీట్ బెల్టు, హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్ కంట్రోల్ లాంటివి పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పోలిస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీపై గచ్చిబౌలి స్టేడియంలో వాక్ ఏ థాన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఎస్సీఎస్సీ అధ్యక్షుడు భరణిలు నడకను ప్రారంభించారు. వెయ్యికి పైగా పోలీసులు, ఐటీ ఉద్యోగులు రహదారి భద్రత నడకలో పాల్గొన్నారు. పోలీస్ సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారు. ప్రతిఒక్కరూ అరగంటపాటు నడక అలవాటు చేసుకోవాలని..అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని సీపీ అన్నారు.
"నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించొచ్చు" - says cyberabad cp sajjanar
రోడ్డు ప్రమాదాలను రహదారి భద్రత అవగాహన కార్యక్రమాల ద్వారా నివారించవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో వాక్ ఏ థాన్ నిర్వహించారు.
రోడ్ సేఫ్టీపై సైబరాబాద్ పోలిస్ ఆధ్వర్యంలో వాక్ ఏ థాన్
TAGGED:
says cyberabad cp sajjanar