లాక్‌డౌన్‌కు ముందు నగర రోడ్లపై రయ్యిన దూసుకెళ్లిన యువత వేగానికి ఆంక్షలు ఒక్కసారిగా కళ్లెం వేశాయి. దాదాపు రెండు నెలలు ఇళ్లకే పరిమితమయ్యారు. సడలింపులతో మళ్లీ పట్టపగ్గాల్లేని పరిస్థితి ఏర్పడింది. మితిమీరిన వేగంతో ప్రమాదాలకు పాల్పడుతూ తాము నష్టపోవడమే కాకుండా.. ఇతరుల జీవితాలను ఆగమాగం చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో రెండు రోజుల క్రితం ఓ కారు విభాగినిని ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి.
పట్టపగ్గాల్లేని వేగం వల్ల..
ఇటీవల నమోదైన ప్రమాదాలను పరిశీలిస్తే.. కార్లు, లారీలు తదితర భారీ వాహనాల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కార్లు, లారీ డ్రైవర్లు పరిమితికి మించి వేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతుంటే.. ద్విచక్ర వాహనదారులు విన్యాసాలు చేయడమూ మరో కారణమవుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఐటీ కారిడార్, ఔటర్‌పై గంటకు 100- 140 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్నారు.
2020లో హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రమాదాలిలా | |||||
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | |
ప్రమాదాలు | 237 | 221 | 179 | 48 | 92 |
క్షతగాత్రులు | 248 | 233 | 191 | 47 | 84 |
మృతులు | 24 | 24 | 16 | 6 | 15 |