హైదరాబాద్ జంటనగరాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో మొత్తం 40 శాతం పైగా మరణాలు తగ్గినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబరు వరకు హైదరాబాద్‌లో 1,909 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా.. ఈ ఏడాది 1,153 మంది చనిపోయారు.
50 ప్రమాద ప్రాంతాల్లో...
రహదారులపై గుంతలు, మరమ్మతులు, విభాగినులు, బారికేడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. నగరంలో 50 ప్రమాద ప్రాంతాలను గుర్తించి సూచికలను ఏర్పాటు చేశారు. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు రంబుల్ స్ట్రిప్స్‌ను రోడ్లపై అమర్చారు. ఎఫ్ఐఆర్లను సేకరించి ప్రమాదాల కారణాలను విశ్లేషిస్తున్నారు.