young man died in Vinayaka immersion:హైదరాబాద్‌లో జరుగుతున్న గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. లారీ వెనుక చక్రాల కింద ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.
నిమజ్జనం వేళ అపశ్రుతి.. లారీ కింద పడి యువకుడు మృతి - road accident
young man died in Vinayaka immersion రాత్రి గణేశ్ నిమజ్జనంలో డీజే పాటలతో డప్పుల కోలహలం మధ్య ఎంతో సంతోషంగా గడిపాడు. నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న తరుణంలో లారీ వెనుక చక్రాల కింద ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
నిమజ్జనం వేళ అపశృతి
వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని శాలిబండ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు జైసాయి శుక్రవారం తెల్లవారుజామున గణేశ్ నిమజ్జనం ముగించుకొని లారీపై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అబిడ్స్ చర్మాస్ వద్దకు రాగానే లారీ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. వెనుక చక్రాలు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: