సికింద్రాబాద్ కార్ఖానాలో విషాదం చోటు చేసుకుంది. పురాతన భవనం కూల్చివేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాత్రి 11 గంటల సమయంలో బిల్డింగ్ కూల్చివేస్తున్న సమయంలో దారినపోయే వ్యక్తిపై ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలు పడ్డాయి. ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.
భవనం కూల్చుతుండగా ప్రమాదం... వ్యక్తి దుర్మరణం - ఆకస్మాత్తుగా వ్యక్తి దుర్మరణం
సికింద్రాబాద్ కార్ఖానాలో ప్రమాదం చోటు చేసుకుంది. పాత భవనం కూల్చివేస్తుండగా బిల్డింగ్ నుంచి జాలువారిన ఇటుకలు తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.
ఆకస్మాత్తుగా వ్యక్తి దుర్మరణం
అదే సమయంలో అటుగా వెళ్తున్న కారుపై సైతం పడటం వల్ల కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాత్రి సమయంలో బిల్డింగ్ కూల్చే సమయంలో యజమాని భద్రతపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ఒక వేడుకకు వెళ్లి ఇంటికి వెళ్తున్న సమయంలో సిమెంట్ దిమ్మలు, ఇనుపరాడ్లు కారుపై పడ్డాయని అన్నారు. ఈ క్రమంలో తమకు ఎలాంటి ప్రమాదం జరగలేదని కారులో ప్రయాణిస్తున్న వారు తెలిపారు.
Last Updated : Mar 16, 2020, 7:05 AM IST