హైదరాబాద్ జూబ్లీహిల్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కేబీఆర్ పార్క్ నుంచి చెక్‌పోస్టు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారునికి కుక్క అడ్డురావడం వల్ల వాహనం అదుపుతప్పి కుక్కతో పాటు డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కుక్కతో పాటు వాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
కుక్క అడ్డురావడం వల్ల రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - రోడ్డు ప్రమాదం తాజా వార్త
కుక్క అడ్డురావడం వల్ల జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కతో పాటు డివైడర్‌ను ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.
కుక్క అడ్డురావడం వల్ల రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
అటుగా వస్తున్న మరో వాహనాదారునికి గాయాలయ్యాయి. మృతుడిని అమీర్‌పేటకు చెందిన బీటెక్ విద్యార్థి చరణ్యాదవ్గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరుకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.