హైదరాబాద్ శివారు శామీర్‌పేట్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు పైవంతెన మీద నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ కింద పడింది. ఘటనలో లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం వాహనం కింద ఇరుక్కుపోవడంతో... బయటకు తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. క్లీనర్‌కు గాయాలు కాగా... అల్వాల్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో బ్రిడ్జ్ కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది
శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి - Accident at shamirpet Outer Ring Road Junction

శామీర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్ జంక్షన్ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి
07:53 May 30
రింగ్‌రోడ్ పైవంతెన మీద నుంచి కిందపడిన సిమెంట్ లారీ
Last Updated : May 30, 2020, 10:12 AM IST