తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటివద్దకే ఆక్సిజన్ సిలిండర్లు'

కరోనా వేళ ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు విలువైన సేవలందిస్తున్నాయి. కొవిడ్ బాధితుల కోసం ఆక్సిస్ ఫౌండేషన్ నిరంతరం పని చేస్తోంది. రోగులకు ఇంటి వద్దకే వచ్చి ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

access foundation services, oxygen cylinders
ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా, ఆక్సెస్ ఫౌండేషన్

By

Published : May 25, 2021, 3:06 PM IST

కరోనా నివారణ కోసం ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆక్సిస్ ఫౌండేషన్ కొవిడ్ బాధితులకు నిరంతరం సేవలందిస్తోంది. లాక్​డౌన్ వల్ల ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న రోగులకు ఇంటి వద్దకు వచ్చి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉన్నందున గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లోని వందమంది బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50మంది డాక్టర్లు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొనసాగుతున్న రెండో డోస్ వ్యాక్సినేషన్

ABOUT THE AUTHOR

...view details