MLAs Purchase Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఎంతో కీలకమైన ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుల కస్టడీ పిటిషన్.. ఏసీబీ కోర్టు ఏం చెప్పిందంటే? - నాంపల్లి కోర్టు ఆదేశం
MLAs Purchase Case Updates: 'ఎమ్మెల్యేల ఎర కేసు'లో ముగ్గురు నిందితులను ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. రేపు కస్టడీ పిటిషన్‌పై తుది తీర్పు ప్రకటించనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.
ACB Special court hearing on MLAs Purchase Case
ఇప్పటికే నిందితులను రెండురోజులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ సరైన సమాచారం సేకరించలేకపోయామని, మరో ఐదు రోజులు కస్టడీకి అనుమతించాలని కోరారు. పోలీసుల పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదులను నాంపల్లి కోర్టు ఆదేశించడంతో మంగళవారం కౌంటరు దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ఏసీబీ ప్రత్యేక కోర్టు... రేపు కస్టడీ పిటీషన్‌పై తుది తీర్పు ప్రకటిస్తామని పేర్కొంది.
ఇవీ చదవండి: