హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య ఏసీబీ అధికారులకు లొంగిపోయాడు. ఓ కేసు సెటిల్మెంట్లో స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేసిన ఎస్సై సుధీర్ రెడ్డి నిన్న అనిశా వలలో చిక్కాడు. పోలీసులు అతన్ని విచారించగా... సీఐ బలవంతయ్య ఆదేశాల మేరకే తాను లంచం తీసుకున్నట్లు ఆధారాలతో సహా అధికారులు ముందుంచాడు.
ఏసీబీ అధికారులకు లొంగిపోయిన జూబ్లీహిల్స్ సీఐ - ఏసీబీకి సీఐ లొంగిపోయాడు
స్టేషన్ బెయిల్ విషయమై లంచం తీసుకుని పరారీలో ఉన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య ఏసీబీ అధికారులకు లొంగిపోయాడు. ఎస్సై సుధీర్‌రెడ్డి, సీఐ బలవంతయ్యకి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఏసీబీ అధికారులకు లొంగిపోయిన సీఐ బలవంతయ్య
దీనితో బలవంతయ్య మీద కూడా వారు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సీఐ బలవంతయ్య ఈ రోజు అనిశా అధికారుల ముందు లొంగిపోయాడు. ఆధారాలతో సహా బలవంతయ్యను, ఎస్సై సుధీర్ రెడ్డిని అనిశా అధికారులు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్ విధించింది.
ఇదీ చూడండి: ఏసీబీ వలలో జూబ్లీహిల్స్ ఎస్సై..