తెలంగాణ

telangana

ETV Bharat / state

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీఎస్టీ అధికారి - acb raids latest updates

acb-raids-on-gst-officer
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీఎస్టీ అధికారి

By

Published : Jan 9, 2020, 5:05 PM IST

Updated : Jan 9, 2020, 7:14 PM IST

16:05 January 09

అ.ని.శా వలలో జీఎస్టీ అధికారి

                   

సీజ్ చేసిన ఒరిజినల్ ఇన్వాయిస్ పేపర్లు ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా.. ఓ జీఎస్టీ అధికారిని అ.ని.శా అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈనెల 6న ఓం ట్రాన్స్​పోర్ట్​లో ముంబయి నుంచి హైదరాబాద్ శ్రీ కృష్ణ ట్రేడర్స్​కు బాదం లోడ్​తో వస్తోన్న ఓ లారీని సేల్స్ టాక్స్ అధికారి లోడ్ వాల్యూకు సరైన పత్రాలు లేవంటూ.. మెహదీపట్నం పిల్లర్ నెం. 53 వద్ద సీజ్ చేశారు. 

    స్టేట్ టాక్స్ ఆఫీసర్ కె బిక్షమయ్య లోడ్​కు సంబంధించిన ఒరిజినల్ ఇన్వాయిస్ పేపర్లు ఇచ్చేందుకు రూ. 60 వేలు డిమాండ్ చేశారు. తాను అంత డబ్బులు ఇవ్వలేనని  ట్రాన్స్​పోర్ట్ మేనేజర్ దినేశ్​ అనగా.. రూ. 35 వేలు  ఇవ్వాలని బిక్షమయ్య ఒత్తిడి చేశాడు. కానీ డబ్బులు ఇచ్చేందుకు ఇష్టపడని దినేశ్​ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

        నాంపల్లిలోని గగన్ విహార్ కార్యాలయంలో బిక్షమయ్య రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అధికారిని ఏసీబీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు డీఎస్పీ ప్రతాప్ తెలిపారు.
 

Last Updated : Jan 9, 2020, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details