హైదరాబాద్ నాంపల్లిలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారిగా పని చేస్తున్న సీహెచ్ శివకుమార్ 50వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు. మాదిరెడ్డి రాజిరెడ్డి అనే వ్యాపారి వద్ద ఆడిట్ రిపోర్ట్ కోసం శివకుమార్ రూ. 50వేల లంచంగా డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు రాజిరెడ్డి అనిశాను ఆశ్రయించారు. పథకం ప్రకారంగా శివకుమార్ లంచం తీసుకుంటుండగా ఏబీసీ అధికారులు పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని అవినీతి అధికారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనిశా వలకి చిక్కిన అవినీతి అధికారి - అవినీతి నిరోధకశాఖ
హైదరాబాద్లో లంచం తీసుకుంటున్న ఓ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారిని అనిశా సిబ్బంది పట్టుకున్నారు. రూ.50వేలను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి అధికారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనిశా వలకి చిక్కిన అవినీతి అధికారి...