నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. మూడురోజులుగా జరుగుతున్న తనిఖీల్లో అధికారులు కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏటా జరిగే పారిశ్రామిక ప్రదర్శనలో 3 వేలకు పైగా దుకాణాలు అద్దె ప్రతిపాదికన కేటాయిస్తుంటారు.
ACB raids: ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు - telangana varthalu
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న తనిఖీల్లో అధికారులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
కొన్ని ఏళ్లుగా జరుగుతున్న కేటాయింపులు సహా.. 7 అంశాల్లో అక్రమాలు జరిగినట్లు ఇటీవల ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన అధికారులు రికార్డుల నిర్వహణ, ఆడిటింగ్, బ్యాంకు లావాదేవీలు వంటి అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. మరో రెండ్రోజులపాటు రికార్డుల పరిశీలన కొనసాగుతుందని సమాచారం.
ఇదీ చదవండి: ఎగ్జిబిషన్ సొసైటీలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు: అనిశా డీఎస్పీ
Last Updated : Jul 4, 2021, 6:21 AM IST