కోటి పది లక్షలు లంచం తీసుకున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు అవినీతి కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రాంపల్లి దాయరలో 19 ఎకరాల 39 గుంటల భూమిని అసలు పట్టాదారుకు ఇప్పించేందుకు.. అంజిరెడ్డి మధ్యవర్తిత్వం వహించినట్లు అనిశా అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఆయన స్నేహితుడి ఇంట్లోనే నాగరాజుకు డబ్బులు ముట్టజెప్పేందుకు ఏర్పాట్లు చేశాడు. అనిశా అధికారులు ఆకస్మిక దాడుల సమయంలో ఆ నలుగురు మినహా ఇతరులు కనిపించలేదు.
అనిశా అధికారుల విచారణ.. వెలుగులోకి కొత్త అంశాలు - అవినీతి కేసులో ఏసీబీ విచారణ తాజా సమాచారం
రాష్ట్రంలో అతిపెద్ద అవినీతి తిమింగలం కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసు ఏసీబీ విచారణలో పలు అంశాలు బయటపడుతున్నాయి. రాంపల్లి దాయరలో 19 ఎకరాల 39 గుంటల భూమిని అసలు పట్టాదారుకు ఇప్పించేందుకు.. అంజిరెడ్డి మధ్యవర్తిత్వం వహించినట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తెలిసింది.
అంజిరెడ్డి భూలావాదేవీలు, స.హ.చట్టం ద్వారా సేకరించిన దస్త్రాలు, ఎస్ఎఆర్ కాపీలు, న్యాయస్థానం ఉత్తర్వులు అక్కడ భారీగా లభ్యమయ్యాయి. నాగరాజు ఇంట్లో 531 గ్రా. బంగారు ఆభరణాలు, 28 లక్షల నగదు, లాకర్ తాళం చెవిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంజిరెడ్డి, శ్రీనాథ్ కార్లను సీజ్ చేశారు. ఆ నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్పై అనిశా న్యాయస్థానంలో శుక్రవారం విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వొద్దంటూ అనిశా తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. కౌంటరు దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి