తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈఎస్​ఐ కేసు: ప్రైవేటు అధికారుల ఇంట్లో 'ప్రభుత్వ పత్రాలు' - LATEST NEWS ON ESI CASE

ఈఎస్​ఐ కేసులో రోజుకో లీల బయట పడుతోంది. బయట పడుతున్న అక్రమాలను చూసి అనిశా అధికారులే నివ్వెరపోతున్నారు. ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి ఇంట్లో జౌషధాల కొనుగోలుకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. కేవలం నాలుగేళ్లలో సుమారు రూ.1000 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈఎస్​ఐ కేసు: ప్రైవేటు అధికారుల ఇంట్లో 'ప్రభుత్వ పత్రాలు'

By

Published : Oct 3, 2019, 10:46 PM IST

ఈఎస్​ఐ కేసు: ప్రైవేటు అధికారుల ఇంట్లో 'ప్రభుత్వ పత్రాలు'

ఈఎస్ఐలో జరిగిన ఔషధాల కుంభకోణంపై అనినీతి నిరోధకశాఖ లోతుగా దరాప్తు చేస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అనిశా.. గత నాలుగేళ్లలో సుమారు రూ.1000 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఏటా రూ.250 కోట్ల ఔషధాలను ఈఎస్ఐ సంచాలకురాలు దేవికారాణి ఆధ్వర్యంలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థ తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 70 డిస్పెన్సరీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఈ తతంగమంతా జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరిస్తున్నారు.

ఒమ్నిమెడి సంస్థ ఉద్యోగి నాగరాజు ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు రూ.46 కోట్లకు పైగా ఇండెంట్లు బయటపడ్డాయి. ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగి నివాసంలో ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోళ్ల పత్రాలు బయటపడడంపై అనిశా అధికారులే నివ్వెరపోయారు. ఇప్పటికి 8 డిస్పెన్సరీలకు సంబంధించిన కొనుగోళ్లను పరిశీలించిన అధికారులు.. సుమారు రూ.10 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అక్రమాలకు సంబంధించి ఈఎస్​ఐ సంచాలకురాలు దేవికారాణితో సహా 8మందిని అరెస్ట్​ చేశారు. వారిని ప్రభుత్వం విధుల్లోనుంచి సైతం తొలగించింది.

ఇవీచూడండి: ఈఎస్​ఐ కుంభకోణంలో కదిలిన డొంక...

ABOUT THE AUTHOR

...view details