మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర తహసీల్దార్ లంచం కేసులో అవినీతి నిరోధక శాఖ నాగరాజు కస్టడీకి పిటిషన్ వేసింది. తహసీల్దార్ నాగరాజుతో పాటు ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులను కస్టడీకి కోరింది. బెయిల్‌పై ఉన్న స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఏను తమ ముందు హాజరు కావాలని తెలిపింది. నలుగురు ఏడు రోజులు కస్టడీ కావాలని అనిశా అధికారులు కోరారు.
లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్ - కీసర తహసీల్దార్ నాగరాజు లంచం కేసు తాజా సమాచారం
లంచం కేసులో తహసీల్దార్ నాగరాజు కస్టడీకి అవినీతి నిరోధక శాఖ పిటిషన్ వేసింది. తహసీల్దార్ నాగరాజుతో పాటు ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులను కస్టడీకి కోరింది.
లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్
రూ.కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ నాగరాజు అనిశాకు పట్టుబడ్డారు. కీసర మండలంలో విలువైన భూమిని కాజేసేందుకు స్థిరాస్తి వ్యాపారులు కుట్ర పన్నారు. రాంపల్లి దాయరలో విలువైన భూమిపై అంజిరెడ్డి, శ్రీనాథ్ కన్నేసి.. తహసీల్దార్‌కు రూ.2 కోట్లు ఇచ్చేలా అంజిరెడ్డి, శ్రీనాథ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు అనిశా నిందితులను కస్టడీకి కోరింది.
ఇదీ చూడండి :లారీని ఢీకొన్న అంబులెన్స్... ఇద్దరు మృతి
Last Updated : Aug 19, 2020, 5:59 PM IST