ఈఎస్‌ఐలో కొనుగోళ్ల వ్యవహారంలో... అనిశా అధికారులు ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును మూడో రోజూ ప్రశ్నించారు. మొదటి రోజు మూడు గంటలు, రెండో రోజు 5 గంటలు విచారణ జరిపిన అధికారులు.. మూడో రోజూ మూడు గంటల పాటు ప్రశ్నించారు.
ఈఎస్ఐ కేసులో ముగిసిన మూడు రోజుల విచారణ - ACB Enquiry On Acchennaidu in third Day
ఈఎస్‌ఐలో కొనుగోళ్ల ఆరోపణలకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ అధికారులు మూడో రోజు విచారణ ముగిసింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అధికారులు మూడు రోజులు ప్రశ్నించారు.
ఈఎస్ఐ కేసులో ముగిసిన మూడు రోజుల విచారణ
టెలీ హెల్త్‌కు సంబంధించిన వ్యవహారంలో కంపెనీకి సిఫారసు చేస్తూ సంతకాలు పెట్టారంటే.... ఆ కంపెనీకి టెండర్లు ఇవ్వాలని చెప్పడమే కదా అంటూ అనిశా అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. కొనుగోలు సమయానికి తాను మంత్రిగా లేనని.. కొనుగోలు దస్త్రాలేవి తన దగ్గరకు రాలేదంటూ అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు రోజుల విచారణ నేటితో ముగిసింది.
ఇదీ చూడండి:మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి