తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటుకు నోటు కేసులో రేవంత్​రెడ్డి డ్రైవర్​, పీఏపై వారంట్​ జారీ - ఓటుకు నోటు కేసు విచారణ

ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్​రెడ్డితో సన్నిహితంగా ఉన్న డ్రైవర్​ రాఘవేందర్​రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యపై అనిశా న్యాయస్థానం బెయిలబుల్​ వారంట్​ జారీచేసింది. ఆగస్టు 9న హాజరు కావాలని ఆదేశించింది.

vote for note case
vote for note case

By

Published : Jul 29, 2021, 7:45 PM IST

ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డ్రైవర్, పీఏపై అనిశా ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్ వారంట్​ జారీ చేసింది.

ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్​రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్ రాఘవేందర్​రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు.. సాక్షులుగా విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీచేసింది. సమన్లు తీసుకున్నా.. ఇవాళ్టి విచారణకు గైర్హాజరయ్యారు. వారిద్దరిపై అనిశా కోర్టు బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆగస్టు 9న హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇవాళ్టి విచారణకు ఉదయ్ సింహా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇదీచూడండి:Jagadish Reddy: డిపాజిట్లు కోల్పోతామనే భయంతోనే దళితబంధుపై విమర్శలు

ABOUT THE AUTHOR

...view details