ఏసీపీ నరసింహారెడ్డి 4రోజుల కస్టడీకి అనిశా కోర్టు అనుమతి - ACP Narasimhareddy to 4 days custody
16:36 September 29
ఏసీపీ నరసింహారెడ్డి 4రోజుల కస్టడీకి అనిశా కోర్టు అనుమతి
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఏసీపీ నరసింహారెడ్డిని న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. దర్యాప్తులో పురోగతి కోసం ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా అవినీతి నిరోధక శాఖాధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 4 రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఏసీపీ నరసింహారెడ్డిని అనిశా అధికారులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. నరసింహారెడ్డి భూ వివాదాల్లో జోక్యం చేసుకొని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అతని ఇంటితో పాటు... బంధువులు, స్నేహితులు ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన అనిశా అధికారులు కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. స్థిరాస్తి వ్యాపారులతో కుమ్మక్కై వివాదాస్పద భూముల విషయంలో రాజీ కుదుర్చి ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసినట్లు తేల్చారు. నరసింహారెడ్డిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని ఆస్తులు బయటపడతాయని అనిశా అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: ఏసీపీ నర్సింహారెడ్డిని కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్