తెలంగాణ

telangana

ETV Bharat / state

"తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి" - తెలంగాణ విమోచన దినోత్సవం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్​ కళాశాల ప్రాంగణంలో ఆ సంఘం నేతలు గోడ పత్రికలు విడుదల చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవం

By

Published : Sep 11, 2019, 5:01 PM IST

'ఈనెల 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో దీనికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా... తెలంగాణకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదని అన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే సెప్టెంబర్ 17న నిజాం, రజాకార్ల నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఆ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా సర్కారు నిర్వహించాలని లేనిపక్షంలో తాము రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం నిర్వహించకపోయినా విమోచన దినోత్సవాన్ని తామే ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details