ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ విద్యానగర్లోని కార్యాలయంలో ఏబీవీపీ నాయకులు సమావేశమయ్యారు. ప్రపంచమంతా కరోనాతో సతమతమౌతుంటే విద్యాసంస్థలన్నీ విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధించడంలో నిమగ్నమయ్యాయని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుమన్ శంకర్ ఆరోపించారు.
'ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమ దోపిడిని అరికట్టాలి' - online classes
విద్యాసంస్థల ఫీజుల వసూళ్లపై హైదరాబాద్ విద్యానగర్లోని ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు.

'ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమ దోపిడీని అరికట్టాలి'
నర్సరీ నుంచి మొదలుకొని పదో తరగతి వరకు విద్యార్థులకు నిర్విరామంగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఫీజుల దందాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఉపాధ్యాయులను తొలగించిన ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.