ఉన్నత విద్యను నిర్వీర్వం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ ఆరోపించారు. అనుభవం లేని, అవినీతి ఆరోపణలున్న వాళ్లను వీసీలుగా నియమించడం తగదని ప్రవీణ్ వాపోయారు.
'రాష్ట్రంలో ఉన్నత విద్యను నిర్వీర్వం చేస్తున్నారు' - ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్
ఉన్నత విద్యను నిర్వీర్వం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు అనుభవం లేని, అవినీతి ఆరోపణలున్న వాళ్లను వీసీలుగా నియమించారని ఆరోపించారు.

'రాష్ట్రంలో ఉన్నత విద్యను నిర్వీర్వం చేస్తున్నారు'
తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయాలు ఎంతో కీలక పాత్ర పోషించాయని… గత కొన్నేళ్లుగా ఇంఛార్జీ వీసీలతో నెట్టుకొచ్చిన విశ్వవిద్యాలయాలకు... కోర్టు మొట్టికాయలతో ప్రభుత్వం వీసీలను నియమించిందని తెలిపారు. వీసీల నియామకంలో యూజీసీ నిబంధనలను గాలికొదిలేశారని... తమకు అనుకూలంగా ఉన్న వాళ్లనే ప్రభుత్వం వీసీలుగా నియమించిందని ప్రవీణ్ మండిపడ్డారు.