ABVP activists besieged Pragati Bhavan: రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు పెంపు నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు చేసిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఏబీవీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడించిన కొందరు విద్యార్థులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు 20మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఉద్రిక్తంగా మారిన ఏబీవీపీ కార్యకర్తల ధర్నా.. - ABVP activists protest
ABVP activists protest Pragati Bhavan: ఇంజినీరింగ్ ఫీజులు పెంపు నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు చేసిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పెంచిన ఫీజులు తగ్గించాలంటూ ప్రగతి భవన్ ముట్టడించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ABVP workers
తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక ప్రజాస్వామ్యం నెలకొందని విద్యార్థులు మండి పడ్డారు. విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులను తెరాస ప్రభుత్వం విద్యకు దూరం చేస్తోందని వారు విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఫీజులు పెంపు నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: