తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తం... ఏబీవీపీ నేతల అరెస్ట్ - tsrtc strike

హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ను ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తం... ఏబీవీపీ నేతల అరెస్ట్

By

Published : Oct 23, 2019, 12:01 PM IST

Updated : Oct 23, 2019, 4:42 PM IST

ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపగా.. పోలీసులు అదుపు చేశారు. ఓ కార్యకర్తను బారికేడ్​పై నుంచి పోలీసులు తోసివేసే ప్రయత్నం చేశారు. ఏబీవీపీ నాయకులు ప్రవీణ్, దిలీప్​లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బృందాలుగా ఏర్పడ్డ ఏబీవీపీ కార్యకర్తలు రెండు గేట్ల వైపు ముట్టడికి ప్రయత్నించారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ప్రగతి భవన్ ప్రధాన రహదారిపై మోహరించారు. ఏబీవీపీ కార్యకర్తలు మాత్రం ఆటోల్లో వచ్చి ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్​లో బొల్లారం తరలించారు.

ప్రగతిభవన్‌ను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు
Last Updated : Oct 23, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details