హైదరాబాద్ రాజ్‌భవన్ రోడ్డులో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తి... ఖైరతాబాద్ సిగ్నల్ దాటుతున్న డీసీఎంకు అడ్డు వచ్చాడు. గమనించిన డీసీఎం డ్రైవర్... అప్రమత్తమై వ్యాన్‌ను డివైడర్ మీదకు ఎక్కించాడు. ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టొద్దనే.. డివైడర్ మీదకు మళ్లించానని వ్యాన్ డ్రైవర్ తెలిపాడు.
వారికేమి కావొద్దని..! - rajbhavan road
అతివేగంతో చాలమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఓ వ్యక్తి అతనికి అడ్డువచ్చాడు. ప్రమాదం జరగవద్దనే ఆలోచన.. పక్కనున్న డివైడర్ మీదకు వ్యాన్ ఎక్కించేలా చేసింది.
త్రుటిలో తప్పిన ప్రమాదం
కారు డ్రైవర్ పాదచారుల మార్గంపైకి దూసుకెళ్లడంతో స్వల్పంగా గాయపడ్డాడు. సమీపంలో ఉన్న ట్రాఫిక్, విపత్తు నిర్వహణ సిబ్బంది గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి:పూల్‌లో విషాదం