50 మంది పేర్లున్న జాబితాపై సుదీర్ఘంగా చర్చించాల్సి ఉండడం వల్ల మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. భారత్-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ఎంపిక జాప్యం అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఆలస్యమయ్యే అవకాశం
ఎమ్మెల్సీ, లోక్సభ అభ్యర్థులపై కసరత్తు చేసిన కాంగ్రెస్.. జాబితాను అధిష్ఠానం ముందు ఉంచింది. భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితుల వల్ల అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నామినేషన్లకు రేపే చివరి రోజు కావడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రాత్రికే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
గాంధీ భవన్
ఇవీ చదవండి:తెరాస సమావేశాలు వాయిదా
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు రేపే చివరి రోజు కావడంతో ఈ రాత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 33 మంది ఆశావహులలో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి మధ్యనే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.