తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎపిడెమిక్ డిసీజ్ చట్టం' అంటే ఏంటో తెలుసా..? - coronavirus updates

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 123 ఏళ్ల క్రితం నాటి చట్టాన్ని అమలు చేసింది. గతంలో పెద్దగా పరిచయం లేని అంటువ్యాధుల నివారణ చట్టం పేరు ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తోంది. ఇంతకీ కరోనా నివారణకు ఈ చట్టానికి సంబంధం ఏమిటి? అసలు 1897 అంటువ్యాధుల నివారణ చట్టం ఏం చెబుతోంది? అంటువ్యాధుల నివారణలో భాగంగా ఈ చట్టం ద్వారా ప్రభుత్వాలకు ఎలాంటి హక్కులు సంక్రమిస్తాయో చూద్దాం పదండి...

about epidemic disease act in telangana
ఎపిడెమిక్ డిసిజ్ చట్టం అంటే ఎంటే తెలుసా..?

By

Published : Mar 26, 2020, 4:27 PM IST

అంటువ్యాధుల వ్యాప్తిని కట్టడి చేసే లక్ష్యంతో అప్పటి బ్రిటిష్ పాలకుల కాలంలోనే అంటువ్యాధుల నివారణ చట్టం రూపు దాల్చింది. 1897లో అప్పటి బొంబాయి ప్రావిన్స్​లో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రజలను బలితీసుకుంది. ఆ సమయంలో వేగంగా వ్యాపిస్తున్న ఆ మహమ్మారిని నిలువరించేందుకు బ్రిటిషర్లు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక హక్కులను కల్పించారు.

ఏడాదిపాటు అమల్లో...

ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ఇప్పటికే సర్కారు ప్రకటించింది. ఏడాది పాటు చట్టం అమలులో ఉంటుందని పేర్కొంది. చట్టం ప్రకారం రైళ్లు, రోడ్డు, ఆకాశ మార్గాల్లో ప్రయాణించే ఏ వ్యక్తినైనా తనిఖీ చేసే అధికారం ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. వ్యక్తులను తనిఖీ చేసిన అనంతరం అవసరమైతే వారిని ఆస్పత్రులు లేక వ్యాధి నివారణ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యాంపులకు పంపే అధికారం ఉంటుంది.
ప్రమాదకర వ్యాధులకు మాత్రమే...
కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. దేశవ్యాప్తంగా లేక ఏదైనా ఒక ప్రాంతంలో అత్యంత ప్రమాదకరంగా వ్యాధి విస్తరిస్తోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తే... అందుకు సాధారణ చట్టాల అమలు ద్వారా వ్యాధిని కట్టడి చేయలేమని అనుకుంటే.. తక్షణం ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావచ్చు.
ఆరు నెలల వరకు జైలు శిక్ష
దేశంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వచ్చే నౌకలను తనిఖీ చేయవచ్చు. అవసరమైతే ఆయా నౌకల్లో ప్రయాణించే వ్యక్తులను నిర్బంధించవచ్చు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపై చర్యలు తీసుకునే హక్కు కల్పించారు. నిబంధనలను అతిక్రమిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. రూ.1000 వరకు జరిమానా లేక ఆరు నెలల వరకు జైలు శిక్షను విధించవచ్చు. ఒక్కోసారి రెండూ కలిపి కూడా విధించే అవకాశం ఉంటుంది.

ఇవీచూడండి:'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'

ABOUT THE AUTHOR

...view details