ఓట్ ఆన్ అకౌంట్‌కు బదులు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడితే చాలా బాగుండేదని కాంగ్రెస్ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు పద్దు గురించి ఎదురు చూశారని.. కాని తాత్కాలికంతోనే సరిపెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే ముఖ్యమంత్రి.. గత నాలుగేళ్లలో 89 వేల కోట్లు అప్పు చేశారని శ్రీధర్ బాబు ఆరోపించారు.
89వేల కోట్లు అప్పా..? - VOTE ON ACCOUNT BUDGET
కేంద్రం నుంచి రాష్ట్రానికి కావల్సిన నిధులు తీసుకురాలేకపోయారని కేసీఆర్‌పై దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ